రైల్వే టికెట్ బుకింగ్‌లో మార్పులు..!
– తత్కాల్‌కు అది ఎంటర్ చేస్తేనే బుకింగ్
– ఏజెంట్లకు కూడా కొత్త నిబంధనలు
– జులై 1నుంచి అమల్లోకి
దర్శిని డెస్క్ : మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ కొత్త నిబంధనలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే రైల్వే శాఖ వచ్చే నెల జులై 1నుంచి కొత్త రూల్స్‌ను అందుబాటులోకి తెస్తుంది.

2025 జూలై 1 నుండి తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. IRCTC మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలతో ఒకటి బుక్ చేసినా.. రెండు బుక్ చేసినా.. అంతకంటే ఎక్కువ చేసినా అందరి ఆధార్ కార్డును తప్పక అందించాల్సిందే. వారి ఆధార్ కార్డుకు లింక్ అయి ఫోన్ నెంబర్లకు ఓటిపీ వస్తుంది. ఆ ఓటిపీని ఎంటర్ చేస్తేనే టికెట్ బుకింగ్ అవుతుంది. లేదంటే బుకింగ్ చేసుకోవడం కష్టం.

అదేవిధంగా రైల్వే బుకింగ్ చేసే ఏజెంట్లకు కూడా కొత్త నిబంధనలు తీసుకవస్తోంది. 2025 జూలై 15 నుండి ఆన్‌లైన్‌లో తత్కాల్ టికెట్ బుకింగ్ కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి ఉండాలని రైల్వే పేర్కొంది. దీంతో పాటు తత్కాల్ బుకింగ్ సమయాల్లో కూడా మార్పులు చేస్తోంది. ఇదివరకు రైల్వే స్టేషన్లలో తాత్కాల్ బుకింగ్‌లో ఏసీ టికెట్లకు ఉదయం 10గంటలకే ఉంటే ఎజెంట్లకు ఉదయం 10-30గంటలకు ప్రారంభమవుతాయి. నాన్ ఏసి టిక్కెట్లకు ఉదయం 11 గంటలకు ఉంటే ఏజెంట్లకు ఉదయం 11-30గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సమాచారంను అందరు తెలుసుకుని తెలిసిన వారితో పంచుకోండి.

ఇదికూడా చదవండి…

