బైపాస్ బాధితులకు బీజేపీ అండ
– సాయిపూర్ బాధితులకు పరిహారం అందించాలి
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్
– రైతు కుటుంబాన్ని పరామర్శించిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మంజూరైన బైపాస్ రోడ్డుకు భూములను కోల్పోతున్నాం బాధితులకు పరిహారం అందే విధంగా బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ అన్నారు. తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన శ్యామమ్మ కుమారుడు నరేష్ బైపాస్ రోడ్డులో పరిహారం అందించడం లేదంటూ ఆవేదన చెంది పెట్రోల్ పోసుకొని ఆత్మ హత్యాయత్నానికి పాల్పాడాదు. గురువారం ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్ పార్టీ నేతలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తల్లి శ్యామమ్మ, కుమారుడు నరేష్ లను పలకరించి పరిస్థితిని ఆరా తీశారు. ఈ సందర్భంగా యు. రమేష్ కుమార్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డులో భూమిని కోల్పోతున్న శ్యామమ్మ కుటుంబానికి ప్రభుత్వం నిర్దేశించిన పరిహారాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. అధికారం పేరుతో పేదలపై వేధింపులకు పాల్పడితే.. న్యాయం జరిగే వరకు ఉద్యమిస్థామన్నారు. వారితో పాటు బైపాస్ రోడ్డులో భూములు కోల్పోతున్న బాధితులందరికీ పరిహారం అందించాలని అన్నారు. బాధితులకు పరిహారం అందే వరకు బీజేపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా పేద రైతుకు పరిహారం అందించే విషయంలో పోలీసుల ప్రమేయంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు చేసిన ఆరోపణలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, ప్లోర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి బంటారం భద్రశ్వర్, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, నాయకులు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.



