ఎస్‌కేటీఎస్ రాఖీ సంబరాలు అదుర్స్..!
– అధికారులకు, నేతలకు రాఖీలు కట్టిన స్టూడెంట్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్(ఎస్‌కేటీఎస్) విద్యార్థులు రాఖీ సంబరాలను అదుర్స్ అనేలా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం శ్రీ క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో రాఖీ పండగను పురస్కరించుకుని ప్రతి యేడాది మాదిరిగానే అధికారులకు, నేతలకు రాఖీలు కట్టారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ నాగార్జు, మండల విద్యాధికారి వెంకటయ్యగౌడ్, ఆర్టీసీ డిపో మేనేజర్ ఆండాలు, పోలీసు అధికారులకు, ఎంపీడీఓ, ఎమ్మార్వో శాఖల అధికారులు, సిబ్బందికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివెళ్లి రాఖీలు కట్టారు. అంతకుముందే పాఠశాల డైరెక్టర్లు ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, దావరి జయవర్ధన్ రెడ్డి, ప్రిన్సిపల్ ఎన్.రమేష్ లకు విద్యార్థులు రాఖీలు. కట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, డీఎస్పీ, పలుశాఖల అధికారులు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు తెలిసేవిధంగా పండగలను జరుపుకోవడం సంతోషకరమని, విద్యార్థులను అభినందించారు. పాఠశాల డైరెక్టర్లు సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాల విలువలపై చైతన్యం కల్పిస్తున్నామన్నారు. పాఠశాల విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్ విద్యనందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రతినిధులు పి. చంద్రశేఖర్రెడ్డి, అనిల్, టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



