పాలశీతలీకరణ కేంద్రానికి మహర్దశ
– రేపటి నుంచి కేంద్రం పురన్ ప్రారంభం
– రైతులు సేవలను సద్వినియోగం చేసుకోవాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు – అంతారం రోడ్డు మార్గంలోని పాల శీతలీకరణ కేంద్రానికి మహర్దశ తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పాల శీతకరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. కేంద్రం రేపటి నుంచి ప్రారంభం కాబోతుండడంతో కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గత రెండేళ్లుగా మూత పడిన కేంద్రాన్ని ప్రారంభించాలని నార్మూల్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డిని కోరడం జరిగిందని గుర్తుచేశారు. దీంతో గత కొన్ని రోజుల క్రితం చైర్మన్ కృష్ణారెడ్డి కేంద్రాన్ని సందర్శించారని తెలిపారు. కేంద్రంలో చిన్న చిన్న మరమ్మత్తులు చేయించి పునర్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రైతులు పాల శీతలీకరణ కేంద్రం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రంకు మహర్దశ తీసుకవచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, నాయకులు తదితరులు ఉన్నారు.

