కేసీఆర్‌తోనే వికారాబాద్ జిల్లా ప్రగతి
– పాలమూరుతో జిల్లా మరింత సస్యశ్యామలం
– సీఎం సభకు గులాబీ దళ బ్రహ్మరథం
– సభ విజయవంతంపై ధన్యవాదాలు
– టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజుగౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా ప్రగతిపథంలో దూసుకపోతుందని, రానున్న రోజుల్లో మరింత ప్రగతిని అందిపుచ్చుకోవడం ఖాయని టీఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి రాజుగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ విజయవంతంపై సంతోషం వ్యక్తం చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు నుంచి నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలు గులాబీ దళంలా తరలివచ్చి బ్రహ్మరథంతో పట్టడంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చొరవతో వికారాబాద్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటయ్యిందన్నారు. జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాకు మెడికల్ కాలేజీని ప్రకటించడం అభినందనీయమన్నారు. వికారాబాద్ జిల్లాకు నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టుపై స్పందించడం హర్షనీయమన్నారు. కేంద్రం నిర్లక్ష్యం వల్ల అడ్డకుంలు ఏర్పడుతున్నాయని, జిల్లా ప్రజలకు ఇచ్చిన మాట కోసం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు తీసుకవస్తామని హామి ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. పాలమూరు పూర్తయితే తాండూరు, పరిగి, కోడంగల్, వికారాబాద్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని దీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.


