ఈద్గా వద్ద అగ్ని ప్రమాదం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఈద్గా వద్ద అగ్ని ప్రమాదం
– గదిలో సామాగ్రి దగ్ధం
– పరిశీలించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు పట్టణం చెన్ష్ పూర్ రోడ్డు మార్గంలో ఈద్గా మైదానం వద్ద అగ్ని ప్రమాదం సంబవించింది. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటు వెలుగులోకి వచ్చింది. ఈద్గా మైదానంలో ఉన్న ఓ గదిలో ప్రమాద వశాత్తు మంటలు అంటుకుని సామాగ్రి దగ్ధమైన బూడిదైపోయాయి. విషయం . తెలుసుకున్న తాండూరు అగ్నిమాపక కేంద్రం అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. మరోవైపు ఈద్గాలో చోటు చేసుకున్న విషయం. తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ వేరువేరుగా సందర్శించి పరిశీలించారు. జరిగిన ప్రమాదం ఆరా తీశారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు మాట్లాడుతూ ఈద్గా మైదానంలో సంబవించిన అగ్నిప్రమాదంపై ఆర్డీఓ, తహసీల్దార్‌కు వివరించి.. జరిగిన నష్టానికి పరిహారం అందించేలా చూస్తామని ఈద్గా కమిటీ చైర్మన్తో అన్నారు. ఈద్గా కమిటి సభ్యులు విద్యుత్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు త‌హ‌సీల్దార్ చిన్న‌ప్ప‌ల నాయుడు, కరణ్ కోట్ ఎస్ఐ మధు సూధన్ రెడ్డి సంఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాల విచారణ ప్రారంభించారు. జరిగిన ప్రమాదం గురించి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కరణం పురుషోత్తంరావు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, పెద్దేముల్ పీఏసీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు పట్లోళ్ల బాల్ రెడ్డి, బోయరాజు, ముస్లిం వెల్ఫేర్ సభ్యులు బాబర్, షల్లో, అబ్దుల్ సలీం తదితరులు ఉన్నారు.