మ‌ల్లారెడ్డిపై మండిప‌డిన యూత్ కాంగ్రెస్..!

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

మ‌ల్లారెడ్డిపై మండిప‌డిన యూత్ కాంగ్రెస్..
– దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేసిన నాయ‌కులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ టీపీసీసీ అధ్య‌క్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డిపై చేసిన విమ‌ర్శ‌న‌ల‌ను ఖండిస్తూ మంత్రి మ‌ల్లారెడ్డిపై యూత్ కాంగ్రెస్ నాయ‌కులు మండిపాటు వ్య‌క్తం చేస్తున్నారు. శుక్ర‌వారం తాండూరు నియోజ‌క‌వ‌ర్గ యూత్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో మంత్రి మ‌ల్లారెడ్డి దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షులు బోయ అశోక్ ఆధ్వ‌ర్యంలో తాండూరు మండ‌లం గౌతాపూర్ చెక్ పోస్టు వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. టీఆర్ఎస్‌కు, మంత్రి మ‌ల్లారెడ్డికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప‌లువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యత గల మంత్రి పదవి ఉన్ననే విషయాని అద మరిచి ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు అయిన రేవంత్‌రెడ్డిపై స్థాయి మ‌రిచి విమ‌ర్శ‌లు చేయ‌డం సిగ్గుచేట‌న్నారు. రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లా రెడ్డి ని మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మంత్రి మల్లా రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అధ్వర్యంలో ఎక్కడిక్కడ అడ్డుకొని తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కావ‌లి సంతోష్‌కుమార్పా, ఉపాధ్యక్షులు మొయిన్, నాయ‌కులు సత్యమూర్తి, బొర్ర రాములు ,జర్నప్ప, అనిల్, అఫ్రోజ్, ఇమ్రోజ్, నర్సింలు గౌడ్, ఖయ్యుం, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.