మల్లికార్జున స్వామి సేవలో పట్లోళ్ల దీప నర్సింలు
– శ్రీశైలంలో కుటుంబ సమేతంగా పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: శ్రీశైల క్షేత్రంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి సేవలో తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు తరించారు. శ్రావణమాసం సందర్భంగా తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ సావిత్రమ్మ, కుటుంబ సమేతం శ్రీశైలంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని మంగళవారం తెల్లవారుజామున దర్శించుకోని స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అందరికి ఆ భగవంతుడి ఆశిషులు తప్పక ఉండాలని ఆమె వేడుకున్నట్లు తెలిపారు. వారి వెంట సాయిపూర్ ప్రజలు తదితరులు ఉన్నారు.


