తప్పుడు కేసులకు చెక్ పెట్టొచ్చు..!
– అరెస్టు వారెంట్ ఉన్నా ఏం చేయలేరు
– నింబంధనలు పాటిస్తే నిర్దోషులకు ఉపశమనం
దర్శిని డెస్క్ : సాధారణంగా మనపై ఎవరైనా కేసు నమోదు చేస్తే అది నిరూపణ అయి నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు చాల సమయం పడుతోంది. దీనిని అదును తీసుకుని కావాలని కొంతమంది చట్టాలను దుర్వినియోగం చేసుకుని తప్పుడు ఎఫ్ఐఆర్‌లను నమోదు చేయిస్తుంటారు. ఇలాంటి కేసుల్లో కేసు ముగిసేంత వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని న్యాయవాద నిపుణులు పేర్కొంటున్నారు. అలాంటి తప్పుడు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయించవచ్చని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా వారిపై తిరిగి కేసు నమోదు చేయొచ్చంటన్నారు. ఇందుకు నష్టపరిహారం కూడ పొందవచ్చని పేర్కొంటున్నారు. దీని గురించి మనం మరింత లోతుగా తెలుసుకుందాం. మన రక్షణ కోసమే చట్టాలు రూపొందించబడ్డాయి. అయితే కొందరు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కుట్ర, ఏదో శత్రుత్వంతోనో, దురుద్దేశంతోనో కొందరు ఒకరిపై తప్పుడు పోలీసు కేసు వేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ అమాయకులను ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది ఎవరికైనా జరగవచ్చు. అటువంటి పరిస్థితిలో రక్షించబడటానికి ఏదైనా చట్టపరమైన మార్గం ఉందా? అంటే ఉన్నాయంటున్నారు న్యాయనిపుణులు. మీపై తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే దానిని రక్షించడానికి IPC (ఇండియన్ పీనల్ కోడ్)లో నిబంధనలు ఉన్నాయి. సీఆర్పీసీలోని ఐపిసి సెక్షన్ 482 ప్రకారం హైకోర్టుకు ప్రత్యేక అధికారం ఇచ్చింది. ఈ అధికారంతో తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేయవచ్చని న్యాయవాదులు తెలుపుతున్నారు. సెక్షన్ 482 ప్రకారం అతను హైకోర్టు నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ సందర్భంలో మీపై ఎటువంటి చర్య తీసుకోరు. పోలీసులు తీసుకునే చర్యలు నిలిపివేయవలసి ఉంటుంది. అయితే ఎఫ్‌ఐఆర్ తప్పు అని రుజువు చేయడానికి మీ వద్ద తగిన ఆధారాలు ఉండాలి.
ఈ సెక్షన్ కింద మీ న్యాయవాది మీ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు మీ నిర్దోషిత్వానికి రుజువు ఇవ్వవలసి ఉంటుంది. సాక్ష్యం సిద్ధం చేయడానికి మీరు న్యాయవాది సహాయంతో సాక్ష్యాలను సిద్ధంగా ఉంచుకోవచ్చు. అలాగే మీకు అనుకూలంగా సాక్షులను సిద్ధంగా ఉంచుకోవచ్చు. మీ దరఖాస్తులో వాటిని పేర్కొనడం అవసరం.
మీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినా, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు. అంటే తప్పుడు ఎఫ్‌ఐఆర్ ఉంటే నేరుగా న్యాయవాది ద్వారా హైకోర్టుకు వెళ్లవచ్చు. న్యాయస్థానం న్యాయమూర్తి అది అవసరమని భావిస్తే అతను దర్యాప్తు అధికారికి దర్యాప్తుకు సంబంధించి ఆదేశాలు, సూచనలను కూడా ఇవ్వవచ్చు. కానీ మీపై తప్పు ఉన్నట్లయితే కోర్టులో ఉపశమనం లభించదని గుర్తించుకోవాలి. మీరు ఎలాంటి తప్పు చేయలేదని భావించినప్పుడే ఆ రకంగా ముందుకు వెళ్లాలి.
అదేవిధంగా మీపై తప్పుడు కేసు వేసిన వారిపై తిరిగి న్యాయపరంగా చర్య తీసుకోవచ్చు. అది ఎలా అంటే మీపై కేసు వేసిన వారిపై పోలీస్టేషన్‌లో గాని, ఉన్నతాధికారులకు, మేజిస్ట్రేట్ వద్ద ప్రవేటు కంప్లేట్ చేసుకోవచ్చు. దీనిపై వారికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 1వెయ్యి జరిమాన విధించవచ్చు. ఒక్కో సమయంలో రెండింటికి విధించవచ్చు.


