రేపు వినాయక ఉత్సవాలపై సమావేశం
– హాజరు కావాలని పట్టన సీఐ రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి
– జయప్రదం చేయండి: హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకునేందుకు రేపు సమావేశం నిర్వహిస్తున్నట్లు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసుశాఖ, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అందరు తప్పక హాజరుకావాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో వినాయకుల చవితి, నిమజ్జన ఉత్సవాలలో సమితి సభ్యులు పాటించే నియమ నిబంధనలపై అవగాహన కల్పించడం జరుగుతుందని, దీంతో పాటు సలహాలు, సూచనలు స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. మరోవైపు హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ వినాయకులను ప్రతిష్టించే సమితి సభ్యులు, యువకులు సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.


