సీటు మీద కూర్చుకోవడం సిగ్గుచేటు

తాండూరు రాజకీయం వికారాబాద్

సీటు మీద కూర్చుకోవడం సిగ్గుచేటు
– చైర్ పర్సన్ పదవి నేను పెట్టిన బిక్ష
– కార్మికులపై కపట ప్రేమ మీదే
– ఆర్డీఓపై వాఖ్యలు చేయడం సరికాదు
-మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : చైర్ పర్సన్ సీటుపై సిగ్గులేకుండా కూర్చుని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ అసమర్థ పాలన చేస్తున్నారని వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు విమర్శించారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లలో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల పీఆర్సీ విషయంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అస్కార్ స్థాయిలో ప్రదర్శన ఇచ్చి కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించారని అన్నారు. కార్మికుల సమ్మెకు మద్దతు ఇచ్చి విషయాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డిసెంబర్ నెలాఖరులో పరిష్కరిస్తామని మేము హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇచ్చిన హామి మేరకు కార్మికులకు ఇచ్చిన హామిని నిలబెట్టుకుని కార్మికుల పీఆర్సీ సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ విషయంలో కూడ మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ హామి ఇస్తే పరిష్కారం అవుతుందా అంటూ ఎద్దేవా చేశారని అన్నారు. చైర్ పర్సన్ గా మూడేళ్లలో అవినీతి, దొంగ ఓటు అంశాలలో ఏం వెలగబెట్టారని అన్నారు. చైర్ పర్సన్ ఒప్పందం విషయంలో మాట తప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. నేను పెట్టిన బిక్షతో చైర్ పర్సన్ పదవిని చేపట్టారని అన్నారు. సిగ్గులేకుండా సీటు మీద కూర్చున్నది నీవు కాదా అంటూ ప్రశ్నించారు. మంగళవారం ఇచ్చిన మీడియా సమావేశంలో మహనటిగా జీవిస్తూ ఆర్డీఓ, ఇంచార్జ్ కమీషనర్ పై అవగాహన లేదంటూ వాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. తాండూరుకు పట్టిన శని వదిలిందని చేసిన విమర్శలను ఖండిస్తూ మూడేళ్లుగా తాండూరుకు పట్టిన శని చైర్ పర్సనే అని అభివర్ణించారు. తాండూరును మిని సింగపూర్ చేస్తామని, శివాజీ చౌరస్తాను జంక్షన్ చేస్తామని, పాత తాండూరును కొత్త తాండూరుగా మారుస్తామని ఇచ్చిన హామీలు ఏమై పోయాయని ప్రశ్నించారు. త్వరలోనే తాండూరుకు పట్టిన శని పోతుందని, అప్పుడే వీడిన గ్రహణం తరువాత సంప్రోక్షణ చేసుకుంటామన్నారు. చైర్ పర్సన్ పాలనకు రోజులు. దగ్గరపడ్డాయన్నారు.

ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం
మున్సిపల్ కార్మికుల పీఆర్సీ సమస్య పరిష్కారం కావడంపై నేతలు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, నేతలు, కార్మికులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్మికులు, నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్లు వరాల శ్రీనివాస్ రెడ్డి, సోమ శేఖర్. అంతారం లలిత, కౌన్సిలర్లు మరికాల రాఘవేందర్, ఆసిఫ్, ప్రభాకర్ గౌడ్, విజయాదేవి. సంగీత ఠాకూర్, అశ్విని గుండప్ప, బంటారం లావణ్య, అస్లాం. ముక్తార్, భీంసింగ్, కోఆప్షన్ సభ్యులు సారంగా విజయ్, వెంకట్రామ్ నాయక్, దేవాలయ చైర్మన్ సంజీవ రావు, నాయకులు అబ్దుల్ సలీం, చంటి యాదవ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.