రక్తదాతలందరు ప్రాణదాతలే
– వజ్రోత్సవ రక్తదాన శిబిరానికి స్పందన
– అభినందించిన లయన్స్ క్లబ్, ఆర్టీసీ, హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రక్తదాతలందరు ప్రాణదాతలే అంటూ లయన్స్ క్లబ్, ఆర్టీసీ రవాణా సంస్థ, హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధులు అభివర్ణించారు. భారత స్వాతంత్ర దినోత్సవం వత్రోత్సవాలలో భాగంగా శనివారం తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌లో తాండూరు లయన్స్ క్లబ్, ఆర్టీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దాదాపు 26 మంది శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బిక్కుమళ్ల శ్రీధర్, అధ్యక్షులు జహీర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్, ఆర్టీసీ డిపో మేనేజర్ అండాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ ప్రభాకర్, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.

రక్తదానం చేయడం ఎంతో గొప్ప అని అన్నారు. రక్తదానం చేసిన దాతలందరు ప్రాణదాతలతో సమానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి మహమ్మద్ యూసుఫ్, సీనియర్ సభ్యులు ఓంప్రకాష్ సోమాని, చంద్రశేఖర్, జుల్ ఫికర్ హుస్సేన్, వరప్రసాద్ గనాటే, పసారం బస్వరాజ్, గోపాలకృష్ణ యాదవ్, కట్కం వీరేందర్, మల్లెపల్లి మధుసూదన్, గాజుల వీరప్రసాద్, వంకదార పద్మనాభయ్య, డాక్టర్ ఆనంద్ రెడ్డి, శిబిరం సూపరవైజర్ వాణి తదితరులు పాల్గొన్నారు.



