పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
– శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే చర్యలు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
– తాండూరులో చవితి, నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని మతాలు ఐక్యమత్యం పాటిస్తూ పండగలను ప్రశాంతగా జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని తులసీ గార్డెన్లో ఏర్పాటు చేసిన శాంతి సమావేశానికి జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి హాజరై మాట్లాడారు. అన్ని మతాల ప్రజలు పండగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండగల సమయాల్లో సోషల్ మీడియాలో మత విదే త్వశాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టరాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గణేష్ చవితి, నిమజ్జన ఉత్సవాలలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు వినాయక చవితి సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించే వినాయక మండపాల ప్రాంతాలతో పాటు చివరి రోజు నిర్వహించే నిమజ్జన ప్రాంతాలను ఎస్పీ కోటిరెడ్డి తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్‌తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, తహసీల్దార్ చిన్నప్పల నాయుడు, కౌన్సిలర్లు, పలు కుల, మత సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


