గ‌ణ‌ప‌య్యా.. దీవించ‌య్యా..!

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

గ‌ణ‌ప‌య్యా.. దీవించ‌య్యా..!
– విఘ్నేశ్వ‌రునికి ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి పూజ‌లు
– ద‌ర్శించుకున్న ప్ర‌జా ప్ర‌తినిధులు, నేత‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: గ‌ణ‌ప‌య్యా.. దీవించయ్యా.. అంటూ ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి విఘ్నేశ్వ‌రున్ని వేడుకున్నారు. బుధ‌వారం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా తాండూరు ప‌ట్ట‌ణంలో మండ‌పాల‌లో కొలువుదీరిన గ‌ణ‌నాథుల‌ను ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ద‌ర్శించుకుని పూజ‌లు నిర్వ‌హించారు.

ముందుగా ప‌ట్ట‌ణంలోని భ‌ద్రేశ్వ‌ర చౌర‌స్తాలో ప్ర‌తిష్టించిన వినాయ‌కునికి ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజ‌లో జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రాజుగౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కులు క‌ర‌ణం పురుషోత్తంరావు, డీసీసీబీ ఉమ్మ‌డి జిల్లా డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ గౌడ్, మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ విశ్వ‌నాథ్ గౌడ్, మార్కెట్ క‌మిటి మాజీ చైర్మ‌న్ వ‌డ్డె శ్రీ‌నివాస్ , హిందూ ఉత్స‌వ స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ట్లోళ్ల న‌ర్సింలు, మాజీ డీపీసీ స‌భ్యులు ప‌ట్లోళ్ల న‌ర్సింలు, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ మాజీ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్‌, టీఆర్ఎస్ సీనీయ‌ర్ నాయ‌కులు డాక్టర్ సంప‌త్ కుమార్, సాయిపూర్ బాల్‌రెడ్డి, శ్రీ‌నివాస్ చారి, మాజీ కౌన్సిల‌ర్లు సుమిత్ గౌడ్, జుబేర్ లాల‌, ప‌ట్ట‌ణ ఉపాధ్య‌క్షులు హ‌రిగౌడ్, కౌన్సిల‌ర్లు ప్ర‌వీణ్ గౌడ్, రాము, స‌ర్పంచ్ మేఘ‌నాథ్ గౌడ్, యువ‌నాయ‌కులు త‌దిత‌రులు ఉన్నారు.

అనంత‌రం ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి గాంధీన‌గ‌ర్‌లో ప్ర‌తిష్టించిన వినాయ‌కున్ని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ యువ నాయ‌కులు బిర్క‌డ్ ర‌ఘు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని ఘ‌నంగా స‌న్మానించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి ప‌ట్ట‌ణంలోని వివిధ వార్డుల్లో ప్ర‌తిష్టించిన గ‌ణ‌నాథుల‌ను ద‌ర్శించుకుని పూజ‌లు నిర్వ‌హించారు.