మమ్మేలూ మట్టి గణపయ్య..!
– శ్రీ సాయిమేధాలో ఘనంగా వినాయక చవితి
– పూజలు చేసిన కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: మమ్మేలూ మట్టి గణపయ్య అంటూ తాండూరు పట్టణం శివాజీ చౌరస్తా సమీపంలో ఉన్న శ్రీ సాయిమేధా పాఠశాల ప్రతినిధులు వినాయకున్ని వేడుకున్నారు. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకుని పాఠశాలలో పండగను వైభవంగా జరుపుకున్నారు. పాఠశాలలో ప్రతిష్టించిన వినాయకునికి కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకునికి ప్రితీపాత్రమై ఉండ్రాల్లు సమర్పించుకుని మొక్కుకున్నారు. అన్ని విఘ్నాలు బాపి సకలం శుభం కలగాలని దీవించుకు వినాయక అంటూ గణనాథున్ని వేడుకున్నారు. ఈ సందర్భంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మట్టి వినాయకున్ని పూజించడం అన్ని విధాల శుభప్రదం అని, ఇందులో భాగంగా పాఠశాలలో మట్టి వినాకున్ని ప్రతిష్టించి పూజించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాన్య కమిటి సభ్యులు, టీచర్లు పాల్గొన్నారు.


