మద్యం దుకాణాలు మూత

తాండూరు వికారాబాద్

మద్యం దుకాణాలు మూత
– 5వ తేది ఉదయం వరకు విక్రయాల నిలిపివేత
– ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కె. నిఖిల
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధిలోని మద్యం దుకాణాలు మూతప‌డ్డాయి. ఆదివారం తాండూరులో జరిగే వినాయక నిమజ్జనంను పురస్కరించుకుని మద్యం విక్రయాలు నిలివేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె. నిఖిల శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఎక్సైజ్ చట్టం 1968 ద్వారా లభించిన అధికారాల మేరకు కలెక్టర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మున్సిపల్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తాండూరు ఎక్సైజ్ అధికారులు దుకాణ దారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో తాండూరు పట్టణంలో మద్యం దుకాణాలు మూత ప‌డ్డాయి. అంత‌కుముందే దుకాణాలు మూతపడుతున్నాయనే విషయం తెలుసుకున్న మందుబాబులు కొనుగోళ్లకు ఎగబడ్డారు.