గ‌ణేష్ ల‌డ్డు ద‌క్కించుకున‌న డీవీఆర్

తాండూరు రాజకీయం వికారాబాద్

గ‌ణేష్ ల‌డ్డు ద‌క్కించుకున‌న డీవీఆర్
– రూ. 1ల‌క్ష 30 వేలకు కైవసం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో వినాయ‌కుల మండ‌పాల వ‌ద్ద జ‌రిగిన ల‌డ్డూల వేలం ఆస‌క్తిక‌రంగా సాగింది. ప‌ట్ట‌ణంలోని సాయిపూర్ సిద్ది వినాయ‌క దేవాల‌యంలో జ‌రిగిన వేలంలో పెద్దేముల్ రైతు స‌హాకార సంఘం చైర్మ‌న్ ద్యావ‌రి విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి(డీవీఆర్) ల‌డ్డును సొంతం చేసుకున్నారు. భ‌క్తుల‌తో పాటు వేలం పాట‌లో అత్య‌ధికంగా రూ. 1ల‌క్ష 30 వేలు పాడి గ‌ణేష్ ల‌డ్డును ద‌క్కించుకున్నారు. ఈ సందర్భంగా డీవీఆర్ మాట్లాడుతూ వినాయ‌కుని కృప సిద్ది క‌టాక్షం అంద‌రిపై మెండుగా ఉండాల‌ని ఆకాంక్షించారు. మ‌రోవైపు వినాయ‌కుని ల‌డ్డును సొంతం చేసుకున్న డీవీఆర్‌ను ఉత్స‌వ కమిటి స‌భ్యులు ఘ‌నంగా స‌న్మానించారు.