హరీష్ రావు రాకకు పకడ్బందీ ఏర్పాట్లు
– పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా దృష్టి
– అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరులో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు రాకకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తాండూరు పట్టణం, మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటన ఖరారైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్టణంలో రైతు బజార్లో వెజ్ అండ్ నాజ్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి చేపట్టే శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు. తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్, డీఎస్సీ శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటి, ఆర్అండ్‌బి అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. మంత్రి హరీష్ రావు పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు.


