గ్రంథాల‌య చైర్మ‌న్ రాజుగౌడ్‌కు ఘ‌న స‌న్మానం

తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రంథాల‌య చైర్మ‌న్ రాజుగౌడ్‌కు ఘ‌న స‌న్మానం
– ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స‌మ‌క్షంలో స‌న్మానించిన ఆర్య‌వైశ్య సంఘం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ‌న్ రాజుగౌడ్‌కు స‌న్మానాలు వెలువెత్తున్నాయి. తాజాగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స‌మ‌క్షంలో మ‌రో స‌న్మానం జ‌రిగింది. గురువారం ఆర్య‌వైశ్య క‌ళ్యాణ మండ‌పంలో కార్య‌క్ర‌మానికి హాజ‌రైన రాజుగౌడ్‌ను సంఘం స‌భ్యులు, స‌మాజం పెద్ద‌లు శాలువాతో స‌త్క‌రించారు. జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్‌గా రాజుగౌడ్ నియామ‌కం అయిన సంద‌ర్భంగా స‌న్మానం చేశారు. ఉద‌యం పూటే రాజుగౌడ్ కోక‌ట్ రోడ్డు మార్గంలోని సాయిబాబా దేవాల‌యంలో బాబాను ద‌ర్శించుకుని పూజ‌లు నిర్వ‌హించిన అనంత‌రం క‌మిటి స‌భ్యులు ఆయ‌న‌ను స‌న్మానించిన విష‌యం తెలిసిందే. అదేరోజు సాయంత్రం ప‌ట్ట‌ణంలోని ఆర్య‌వైశ్య క‌ళ్యాణ మండపంలో సంఘం స‌భ్యులు స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో సంఘం స‌భ్యులు క‌ట్కం వీరేంద‌ర్, కోట్రిక శ్రీ‌కాంత్, రొంప‌ల్లి సంతోష్ కుమార్, కోట్రిక కిర‌ణ్‌, కౌన్సిల‌ర్ మంకాల రాఘ‌వేంద‌ర్, న‌గేరేశ్వ‌ర దేవాల‌య‌ చైర్మ‌న్ కుంచం ముర‌ళి, స‌ల్లా దామోద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.