మునుగోడుకు గులాబీ దండు

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

మునుగోడుకు గులాబీ దండు
– తాండూరు నుంచి బ‌య‌ల్దేరిన నేత‌లు
– 150 వాహ‌నాల్లో కేసీఆర్ స‌భ‌కు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: మునుగోడులో జ‌రిగే ప్ర‌జా దివేన స‌భ‌కు తాండూరు గులాబీ నేత‌లు త‌ర‌లివెళ్లారు. మునుగోడు ఉపఎన్నిక సంధ‌ర్భంగా ఏర్పాటు చేసిన ఈ స‌భ‌కు సీఎం కేసీఆర్ హాజ‌రు కానుండ‌డంతో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేర‌కు నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ అధికార ప్ర‌తినిధి రాజుగౌడ్ ఆధ్వ‌ర్యంలో నేత‌లు, కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివెళ్లారు. శ‌నివారం ఉద‌యం తాండూరు నుంచి దాదాపు 150 వాహ‌నాల‌లో నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను త‌ర‌లించే ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా అధికార ప్ర‌తినిధి రాజుగౌడ్‌తో పాటు సీనీయ‌ర్ ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి త‌దిత‌రులు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు టీఆర్ఎస్‌ను గెలిపిస్తాయ‌న్నారు. బీజేపీని న‌మ్మె ప‌రిస్థితి లేద‌న్నారు. స‌భ‌కు త‌ర‌లివెళ్లిన వారిలో భ‌ద్రేశ్వర దేవాల‌య చైర్మ‌న్ బంటారం సుధాక‌ర్, మార్కెట్ క‌మిటి వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, టీఆర్ఎస్ ఉపాధ్య‌క్షులు హ‌రిహ‌ర గౌడ్, కౌన్సిల‌ర్ ముక్తార్ నాజ్, ఉర్దూఘ‌ర్ మాజీ చైర్మ‌న్ అబ్దుల్ స‌లీం త‌దిత‌రులు ఉన్నారు.