– తులం ఆభరాణలు ఉన్న పర్సు మాయం
తాండూరు: బంగారు షాపుకు వెళ్ళిన ఓ మహిళ పర్సు మాయమైంది. అందులో తులం పైగా విలువైన బంగారు ఆభరణాలు ఉండడంతో బాధిత మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం తాండూరు పట్టణంలో జరిగింది. బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.


తాండూరు పట్టణం సుభాష్ నగర్‌కు చెందిన కల్పన తాండూరు మండలం కరణ్‌కోట్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తొంది. శనివారం తన వద్ద ఉన్న 11 తులాల బంగారు ఆభరణాలను వేసి కొత్త ఆభరణాలు కొనుగోలు చేసేందుకు పట్టణంలోని గాంధీచౌక్ సమీపంలో ఉన్న ఓ బంగారు దుకాణం వద్దకు వెళ్లింది. అక్కడ ఆభరణాలు నచ్చకపోవడంతో వేరే దుకాణానికి వెళ్లింది.

అప్పుడే అంతకుముందు వెళ్లిన షాపులో తన పర్సును మరిచిపోయినట్లు గుర్తుకురావడంతో తిరిగి వెళ్లి చూసే సరికి అక్కడ తన పర్సు మాయమైంది. షాపు యజమానులను అడగగా తెలియదని చెప్పడంతో ఆందోళనకు గురైంది. వెంటనే ఆమె పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

