రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు..!
– పత్తి కొనుగోళ్లల్లో ఇబ్బందులకు గురిచేయొద్దు
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులను మోసం చేయడం గాని, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే చర్యలు తప్పవని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం యాలాల మండలం అగ్గనూర్ సమీపంలోని మారుతి ఇండస్ట్రీస్ లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సందర్శించారు. కేంద్రంలో కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి.. ఇప్పటి వరకు ఎంత మేర కొనుగోలు చేశారని ఆరా తీశారు. తూకాల సక్రమంగా చేస్తున్నారా లేదా అని స్వయంగా పరిశీలించారు. కొనుగోళ్లలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పత్తి కొనుగోళ్ల వి షయంలో నిర్వహకులు రైతులకు ఎలాంటి మోసాలు, ఇబ్బందులకు గురిచేయరాదని అన్నారు. నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేసి డబ్బులు సకాలంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యలయ అధికారి మాణిక్ రావు, సీసీఐ కొనుగోలు సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

పాడు పనికి పండిన పాపం..!