మిషన్ భగీరథ పనులను త్వరగా పూర్తిచేయాలి
– క్వాలిటీ కంట్రోల్ ఈఈ లచ్చిరాం
తాండూరు, దర్శిని ప్రతినిది: తాండూరు మున్సిపల్ పరిధిలో మిషన్ భగీరథ పనులను త్వరగా పూర్తిచేయాలని క్వాలిటి కంట్రోల్ ఈఈ లచ్చిరాం అన్నారు. బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు వద్ద నిర్మిస్తున్న మిషన్ భగీరథ పైపులైన్ పనులతో పాటు మున్సిపల్ వెనుక భాగంలో నిర్మిస్తున్న 750 కేఎల్ సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఈ లచ్చిరాం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి తాగునీరందించాలనే లక్ష్యంతో మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. తాండూరులో చేపడుతున్న మిషన్ భగీరథ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మిషన్ భగీరథ డీఈ సాజిద్ అలీ, మున్సిపల్ ఏఈ ఖాజా, సిబ్బంది తదితరులు ఉన్నారు.

