కౌన్సిల‌ర్ ముక్తార్ నాజ్‌కు ప‌రామ‌ర్శ‌

తాండూరు రాజకీయం వికారాబాద్

కౌన్సిల‌ర్ ముక్తార్ నాజ్‌కు ప‌రామ‌ర్శ‌
– మాతృవియోగంపై ఓదార్చిన గ్రంథాల‌య చైర్మ‌న్ రాజుగౌడ్
– ప‌రామ‌ర్శించిన మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ గుప్త
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ 19వ వార్డు కౌన్సిల‌ర్ ముక్తార్ నాజ్‌ను ప‌లువురు నేత‌లు ప‌రామ‌ర్శించారు. ఆదివారం ముక్తార్ నాజ్ త‌ల్లి క‌న్నుమూశారు. ఈ విష‌యం తెలుసుకున్న వికారాబాద్ జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రాజుగౌడ్, తాండూరు మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ గుప్త‌లు వేరు వేరుగా ముక్తార్ నాజ్ నివాసానికి వెళ్లారు. ముక్తార్ నాజ్‌ను ఓదార్చి భ‌రోసా అందించారు. అంత‌కుముందు ముక్తార్ త‌ల్లి మ‌ర‌ణం ప‌ట్ట విచారం వ్య‌క్తం చేశారు. ఇలాంటి స‌మ‌యాల్లో మ‌నోనిబ్బ‌రంగా ఉండాల‌ని ముక్తార్ నాజ్‌కు ధైర్యం చెప్పి.. మేమంతా అందుబాటులో ఉంటామ‌ని భ‌రోసా అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ మాజీ ఫ్లోర్ లీడ‌ర్ సుమిత్ గౌడ్, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ ఉపాధ్య‌క్షులు హ‌రిహ‌ర గౌడ్, కుటుంబ స‌భ్యులు త‌దిత‌రులు ఉన్నారు.