అరుదైన ఘనతలు సాధించాలి
– సివిల్స్ ర్యాంకర్ మేఘనను సన్మానించిన కేటీఆర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: గ్రామీణ ప్రాంతానికి చెందిన కూడ సివిల్స్‌లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన కావలి మేఘన భవిష్యత్తులో అరుదైన ఘనతలు సాధించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామానికి చెందిన కావలి మేఘన సివిల్స్‌లో 83వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాంకర్ కావలి మేఘన ఆమె కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్‌లో మెరిసిన మేఘనను మంత్రి కేటీఆర్ శాలువా, పుష్పగుచ్చంతో సత్కరించి అభినందించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కావలి ఉన్నత శిఖరాలకు ఎదిగి.. అరుదైన ఘనతలను సాధించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
