పాంచ్.. పటాకా..!
– ఐదో రోజు 5 నామినేషన్లు
– ముగ్గురు పార్టీల నుంచి, స్వతంత్రులుగా ఇద్దరు
– వెల్లడించిన తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి: శాసనసభ ఎన్నికలలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం తాండూరులో జోరందుకుంది. బుధవారం ఐదో రోజు ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి, తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, బీఎస్పీ నుంచి బోయిని చంద్రశేఖర్, డీఆర్పీ నుంచి పి. అజయ్ రెడ్డి, స్వతంత్రులుగా పెద్దోళ్ల ఆనంద్ కుమార్, మాణ్యలు నామినేషన్లు వేశారని వెల్లడించారు. ఈనెల 3 నుంచి ప్రారంభ మైన నామినేషన్ల ప్రక్రియలో ఇప్పటి వరకు మొత్తం 13 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ రావు తెలిపారు.
ఇదికూడా చదవండి…

