బీఆర్ఎస్‌ను తరిమే శక్తి మీచేతుల్లో ఉంది
– కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే.. ఆదరిస్తాం
– ముదిరాజుల సంక్షేమానికి పాటుపడతా
– ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి
– తాండూరులో ముదిరాజుల ఆత్మీయ సభ విజయవంతం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదల అభివృద్ధికి ప్రమాదకరమైన బీఆర్ఎస్ పార్టీని తరిమే శక్తి మీచేతుల్లోనే ఉందని, ఓటు హక్కుతో ఆ పార్టీ బొందపెట్టాలని కాంగ్రెస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

శుక్రవారం తాండూరు పట్టణంలోని శ్రీనివాస రైస్ మిల్లు వద్ద ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సమ్మేళనానికి తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి ముదిరాజులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తాండూరులో ఆత్మీయ సమ్మేళాన్ని దృష్టిలో ఉంచుకుని ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారీ ర్యాలీగా ముదిరాజులు ఆత్మీయ సమ్మేళన సభ వద్దకు చేరుకున్నారను. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి. డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి బీఆర్ఎస్ పార్టీ మోసాలు. అరాచకాలతో పాలన కొనసాగించిందన్నారు.
ఈ ప్రమాదకర పార్టీని ఎన్నికల్లో తొలగించే శక్తి ఓటర్ల చేతిలో ఉందన్నారు. తాండూరు నియోజకవర్గంలోని ముదిరాజులు అందరు బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలన్నారు. గతంలో తాండూరు ప్రజలు నమ్మి ఓటేస్తే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్వార్థం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరి పోయారని అన్నారు. అభివృద్ధి చేస్తానని హామి ఇచ్చి అక్రమాల్లో, మత్తు వ్యవహారాన్ని తాండూరుకు ముందు వరుసలో నిలిపారని విమర్శించారు.
పేదల సంక్షేమాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించిందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే అందరి సంక్షేమాన్ని ఆదరిస్తామన్నారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, ఉత్తమ్ చంద్. రాకేష్ మహరాజ్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ మండలాల సభ్యులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

