ఇంటికి టీవీ చూసేందుకు వ‌స్తే

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటికి టీవీ చూసేందుకు వ‌స్తే
– బాలిక‌పై అత్యాచార‌య‌త్నానికి పాల్ప‌డిన సర్పంచ్
– వికారాబాద్ జిల్లా బ‌షీరాబాద్ మండ‌లంలో సంఘ‌ట‌న
వికారాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: మ‌తిస్థిమితం సరిగ్గా లేద‌ని తెలిసినా ఓ బాలికపై స‌ర్పంచ్ అత్యాచారాయ‌త్నానికి పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న వికారాబాద్ జిల్లా బ‌షీరాబాద్ మండ‌లం నంద్యానాయ‌క్ తండాలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ స‌భ్యులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి. నంద్యా నాయ‌క్ తండా స‌ర్పంచ్ శంక‌ర్ ఇంటికి ఓ బాలిక టీవీ చూసేందుకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన స‌ర్పంచ్.. మ‌తిస్థిమితం లేని బాలిక‌ను ఇంటిపైకి తీసుకెళ్లాడు. ఆమెపై లైంగిక‌దాడికి య‌త్నించాడు. అయితే స‌ర్పంచ్ ఇంటికి వెళ్లిన త‌మ బిడ్డ ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో.. శంక‌ర్ ఇంటికి వెళ్లారు. అత‌ను ఆమెపై లైంగిక‌దాడికి య‌త్నించాడు. అప్ప‌టికే ఇంటికి వ‌చ్చిన బాలిక కుటుంబ స‌భ్యులు ఇంటిపైకి వెళ్లారు. స‌ర్పంచ్ శంక‌ర్‌ను బంధించి, దేహ‌శుద్ధి చేశారు. బాధితురాలి త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సంఘ‌ట‌న అనంత‌రం స‌ర్పంచ్ పరారీ అయ్యాడు.