పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లు పెట్టాలి
– లేదంటే ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదు
– బీసీ సంఘం తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ పార్లమెంట్లో సమావేశాలు ప్రారంభమైన దృష్ట్యా ఈసారైనా బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో దాదాపు 60 శాతం వరకు బీసీలు ఉన్నారని, బీసీలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ వంటి మొత్తం 14 పార్టీలు తీర్మానం చేశాయని గుర్తుచేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశ పెట్టి స్థానిక సంస్థల రిజర్వేషన్లను 52 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో గల్లి నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలు చె స్తామని హెచ్చరించారు. మరోవైపు తొలిసారి పార్లమెంట్లో బీసీల తరుపున గళం విప్పుతున్న బీసీ దళపతి ఆర్.కృష్ణయ్యకు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.



