గణేష్ ఉత్సవాతాలను శాంతియుతంగా జరుపుకోవాలి
– తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ
– పురవీదుల్లో సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ కవాతు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే వినాయక ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలో సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. దాదాపు 100 మందితో మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు, ఇందిరానగర్, సాయిపూర్ తదితర ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ వచ్చే గణేష్ ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలలో కవాతు చేపట్టినట్లు వెల్లడించారు. వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ప్రజలు ఎలాంటి అవాంచనీయ సంఘటనకు పాల్పడకుండా పండగను ప్రశాంత వాతావరణంలో జరపుకోవాలన్నారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామనే తెలిపేందుకు ఈ కవాతు చేపట్టినట్లు వివరించారు. కావున ప్రజలు పండగలను సామరస్యంగా జరుపుకుని పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, ఆర్ఏఎఫ్ డీఏస్పీ, ఎస్ఐలు గిరి, ఏడుకొండలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
