ఏఆర్ కానిస్టేబుల్ మరణం బాధాకరం
– విచారం వ్యక్తం చేసిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
– జిల్లా ఎస్పీ, ఏఆర్ ఇంచార్జ్ ఆర్ఐలతో ఆరా
– నర్సప్ప కుటుంబానికి అండగా ఉంటామని హామి
తాండూరు, దర్శిని ప్రతినిధి : విధుల ఒత్తిళ్లతో కానిస్టేబుల్ కుటుంబానికి కీడు జరగడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి తన తన భద్రత సిబ్బందిలో పని చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నర్స(35) రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంపై శాసన మండలిలో తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. బషీరాబాద్ మండలం రెడ్డి ఘనపూర్ కు చెందిన నర్సప్ప ఎస్కార్ట్ డ్యూటీని పూర్తిచేసుకుని ఇంటికి వెళ్లారు. అయితే భద్రేశ్వర జాతర ఉత్సవాల విధులకు వస్తుండగా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ సమీపంలోని నిర్లక్ష్యంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద అదుపుతప్పి బైకుతో పాటు గుంతలో పడి మృతి చెందారు.

ఈ విషయం తెలిసిన మహేందర్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు. వెంటనే వికారాబాద్ జిల్లా ఎస్పీ, ఏఆర్ ఇంచార్జ్ ఆరిఐ కి ఫోన్ చేశారు. ఒక వ్యక్తి రెండు విధులను ఎలా నిర్వహిస్తారని ఆయన నేరుగా పోలీసులు అధికారులను ప్రశ్నించినట్లు ప్రకటనలో తెలిపారు. పని ఒత్తిడితో ఒక నిండు ప్రాణం పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదనపు విధుల ఒత్తిడిల వల్ల ఇబ్బందులకు గురవుతున్నట్లు ఫిర్యాదు చేశారు. ఇది సరైనది కాదని మహేందర్ రెడ్డి ఎస్పీతో సహా ఆరికి వివరించారు. నర్సప్ప కుటుంబానికి తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అదనపు విధుల నిబంధనలు వికారాబాద్ జిల్లాలో సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వలేకపోవడం, కనీసం విశ్రాంతి లేకుండా పోవడంతో ప్రాణాలు పోతున్నాయని వాపోయారు.


