సగ్గు బియ్యం చేసే సాయం తెలుసా..!
– ఇందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు
– ఎముకల వ్యాధులు కూడ దూరం
దర్శిని డెస్క్ : సగ్గు బియ్యం అనగానే ఉపవాస సమయంలో ఉపయోగించే ఆహారం అని అందరికి గుర్తుకువస్తుంది. వ్రతాల సమయం లొ దీనిని ఎక్కువగా వాడతారు. సాగొ అనే పేరుతొ ప్రాచుర్యం పొందిన సగ్గుబియ్యం కర్ర పెండలం నుండి తీసుకోబడిన పొడి నుండి తయారుచేయబడుతుంది. ఛౌవ్వరి, సగుదనా, అవ్వరిషి గా సగ్గుబియ్యం ప్రసిద్ది. ఈ సగ్గుబియ్యంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. రోజూ సగ్గుబియ్యం తింటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. సగ్గుబియ్యంలో ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు క్యాలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. రోజూ తీసుకోవడం వల్ల అనేక సమస్యలను అధిగమించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి ఎముకలను బలోపేతం చేయడంతో పాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ఈ సగ్గు బియ్యంతో ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఎముకలకు బలం
సగ్గు బియ్యంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం శరీరంలోని ఎముకలను బలంగా మారుస్తాయి. రోజూ సగ్గుబియ్యం తీసుకుంటే ఎముకలు మరింత దృఢంగా మారుతాయి. అంతేకాకుండా కాకుండా, సగ్గుబియ్యంలో ఐరన్ కూడా ఉంటుంది. ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మరిన్ని ఎముకల సమస్యలు దూరం అవుతాయి.
మెదడుకు ఉపయోగం
మానవ శరీరంలో అతిముఖ్యమైన మెదడుకు సగ్గు బియ్యం ఎంతో మేలు చేస్తుంది. తినడం వల్ల మంచి శారీరక అభివృద్ధి జరగడమే కాకుండా మెదడు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫోలేట్ మెదడు సమస్యలను దూరం చేస్తుంది.
బరువు తగ్గుదల
సగ్గుబియ్యం తినడం వల్ల శరీర బరువు పెరుగుతుంది. ఇది మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలను కలిగి ఉంటుంది, ఇది బరువును పెంచడంలో సహాయపడుతుంది. శరీరం సన్నగా ఉంటే, మీ ఆహారంలో సగ్గుబియ్యాన్ని ఖచ్చితంగా చేర్చుకోండి. ఇవి శరీరాన్ని ఫిట్‌గా, షేప్ గా మారుస్తాయి.
నియంత్రణలో రక్తపోటు
అధిక రక్తపోటు సమస్యను అధిగమించాలనుకుంటే సగ్గుబియ్యం తినాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఫైబర్, ఫాస్పరస్, పొటాషియం, ఫాస్పరస్ ఉన్నాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంతోపాటు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తాయి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం అవగాహన కోసమే అందించాం. వీటిని పాటించే ముందు దయచేసి డాక్టర్ లేదా నిపుణుల సలహాలు తప్పక తీసుకోవాలి.

