గ్రూప్-1 అభ్యర్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్
– ఉదయం నుంచి అందుబాటులో బస్సు సర్వీసులు
– తాండూరు డీపో మేనేజర్ ఉపేందర్
తాండూరు, దర్శిని ప్రతినిధి: గ్రూప్-1 పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు తాండూరు ఆర్టీసీ డీపో అధికారులు గుడ్ న్యూస్ చేశారు. తాండూరు డీపో నుంచి అభ్యర్థుల కోసం ప్రత్యేక సర్వీసులను నడిపిస్తున్నట్లు శనివారం డీపో మేనేజర్ ఉపేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం పరీక్షను దృష్టిలో ఉంచుకుని ఉదయం 4 గంటల నుంచే బస్సు సర్వీసులను అందుబాటులో ఉంటాయని చెప్పారు. తాండూరు పట్టణం నుంచి వికారాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్ రూట్లలో ఈ బస్సులు నడిపించడం జరుగుతుందని వివరించారు. తాండూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల అభ్యర్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా గ్రూప్-1 అభ్యర్థుల బస్సు సర్వీసు కోసం బస్ స్టేషన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని, వివరాలకు సెల్: 8985980075 లేదా 8500701231లకు సంప్రదింవచ్చని సూచించారు.

