బీఆర్ఎస్ పార్టీకి భారీ విరాళం సేకరణ

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ పార్టీకి భారీ విరాళం సేకరణ
– తాండూరు నుంచి రూ.1 లక్షన్నర వసూలు
– త్వరలో మంత్రి కేటీఆర్‌కు అందింస్తాం: నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన నేపథ్యంలో నేతలు పార్టీ బలోపేతానికి దృష్టిసారించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్‌ పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా తాండూరు నేతలు భారీగా విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతలో రూ. లక్షన్నర నగదును సేకరించగా తాజాగా ఒకే రోజులో మరో రూ. 1 లక్ష 50 వేలను సమకూర్చారు. ఈ విషయాన్ని మంగళవారం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ వెల్లడించారు. నగదు సేకరించి చెక్కు రూపంలో మార్చడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. దేశాభివృద్ధి సీఎం కేసీఆర్‌తో సాధ్యమవుతుందని అన్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి సీఎం కేసీఆర్ దేశంలో కీలకంగా మారుతారని అన్నారు. పార్టీ పటిష్టత కోసం సేకరించిన రూ. 1.50 లక్షలను త్వరలోనే మంత్రి కేటీఆర్‌కు ఎంపీ రంజిత్‌ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల సమక్షంలో టీఆర్ఎస్‌ భవన్‌లో అందజేస్తామని వెల్లడించారు. ఈకార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, సాయిపూర్ బాల్‌ రెడ్డి, మసూద్, మన్మోహన్ సార్డా, రొంపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.