రేపటి నుంచి వాట్సాప్ సేవలు బంద్
– కేవలం ఈ ఫోన్లలో మాత్రమే
– నిర్ణయం తీసుకున్న సంస్థ
దర్శిని డెస్క్ : రేపటి నుంచి ఫోన్లలో వాట్సాఫ్ సేవలను బంద్ చేస్తున్నట్లు టెక్ కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలు ప్రకటించాయి. సాంకేతికతంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని కొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకవస్తోంది. దీంతో పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలను రద్దుచేయబోతోంది. ఈ సేవలలో రేపటి నుంచి అంతరాయం ఏర్పడుతుంది.
ఏయే ఫోన్‌లలో బంద్ అవుతున్నాయంటే..
సెక్యూరిటీ ఫీచర్ల అప్‌గ్రేడ్, యూజర్ డేటా ప్రైవసీ ప్రొటెక్షన్‌లో భాగంగా సోషల్ మీడియా సంస్థలు వాట్సాప్ సేవలను బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్‌లలో కొన్ని మోడల్స్‌కు అక్టోబరు 24 నుంచి తమ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 ఓఎస్‌తో పనిచేస్తున్న ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు. ప్రస్తుతం ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ ఫోన్లు ఈ ఓఎస్‌లతో పనిచేస్తున్నాయి. యాపిల్ నిబంధనల ప్రకారం ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్ మోడల్స్‌లో ఓఎస్ అప్‌డేట్ కాదు. కేవలం ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ మోడల్స్ మాత్రమే ఓఎస్ అప్‌డేట్‌కు అవకాశం ఉంది. మరోవైపు ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం వాట్సాప్ కీలక సూచన చేసింది. ఆండ్రాయిడ్ 4.0.4 వెర్షన్ ఓఎస్‌తో పనిచేస్తున్న ఫోన్లలో కూడా వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్లు తెలిపింది.
ఏం చేయాలంటే..
దీంతో ఈ ఫోన్ యూజర్లు వెంటనే తమ డివైజ్‌లలో ఐఓఎస్ 12ను అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది. ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ సెక్షన్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై క్లిక్ చేసి ఓఎస్‌ను అప్‌గ్రేడ్ చేయొచ్చు. ఈ ఓఎస్ తర్వాతి వెర్షన్‌కు యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

