తాండూరు పోతురాజు ఇకలేరు..!

తెలంగాణ

తాండూరు పోతురాజు ఇకలేరు..!
– గుండెపోటుతో డ్యాన్స్‌మాస్టర్ అశోక్ కన్నుమూత
– జానపద రంగంలో విషాదం, కళాకారుల దిగ్బ్రాంతి
– కళాకారుడుగా అశోక్ సాధించిన విజయాలు ఇవే
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో పోతురాజుగా గుర్తింపు పొందిన తాండూరు కళాకారుడు అశోక్(డ్యాన్స్‌ మాస్టర్) ఇకలేరు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణం పాత తాండూరులోని నివాసంలో గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశారు.

ఆయన మరణంతో స్థానికులు, కళాకారులు తీవ్ర దిగ్బ్రాంతికి గురుయ్యారు. తాండూరుకు చెందిన అశోక్ తన చిన్నతనం నుంచి యాలాల మండలం విశ్వనాథ్‌పూర్‌లో ఉండే అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగారు. చిన్నతనం నుంచే జానపద కళలపై మక్కువ పెంచుకున్న అశోక్ అదే రంగంలో రాణించారు. జానపద నృత్యాలు, ప్రదర్శనలు ఇచ్చి గుర్తింపు పొందారు. తాండూరులో ఫైన్‌ ఆర్ట్స్ కల్చరల్‌ అకాడమిని స్థాపించి ఎందరో కళాకారులను తయారు చేశారు.

అశోక్ తెలంగాణ బోనాలతో పాటు, పోతురాజు ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తన ప్రదర్శనలతో వరల్డ్ లిమ్కా బుక్‌లో స్థానం సంపాదించుకున్నారు. పోతురాజు వేషాధారణలో జాతీయ స్థాయింలో సుమారు 10 వరకు అవార్డులు పొందారు. అందరితో కలివిడిగా ఉండే అశోక్ కుమార్ సోమవారం తన నివాసంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంభీకులు తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అశోక్ మృతి చెందారని వైద్యులు నిర్దారించారు. అశోక్‌కు భార్యతో పాటు కుమారుడు ఉన్నారు. అశోక్ మృతి పట్ల తాండూరులోని కళాకారులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

జై శ్రీరాం.. జైజై.. శ్రీరాం..!