వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్

టెక్నాలజీ తెలంగాణ

వాట్సాప్‌లో కొత్త ఫీచ‌ర్
– త్వ‌ర‌లో క‌మ్యూనిటీ చాటింగ్‌కు అవ‌కాశం
హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: సాకేంతిక రంగంలో విప్ల‌వంగా విస్త‌రించిన వాట్సాప్ సంస్థ వినియోగ‌దారుల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త సేవ‌ల‌ను అందుబాటులో తెస్తోంది. తాజాగా ఈ సంస్థ కస్టమర్ల కోసం సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వాట్సాప్‌లో ఇప్పటికే చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా రాబోతుంది గ్రూప్ చాటింగ్. ఈ కొత్త ఫీచర్ లేటెస్ట్ బీటా వెర్షన్ v2.21.21.6లో అందుబాటులోకి వస్తుంది. ఈ వెర్షన్
కోసం యూజర్లు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కంపెనీ కొత్త ఫీచర్‌తో అప్ డేట్ వెర్షన్ రిలీజ్ చేయగానే వెంటనే డౌన్ లోడ్ చేసుకునేందుకు యూజర్లు సిద్ధంగా ఉన్నారు.వాట్సాప్ లో కమ్యూనిటీ ఫీచర్ గనుక అందుబాటులోకి వస్తే ప్రస్తుతం మనం గ్రూప్స్ లో చేస్తున్న మెసేజింగ్ విధానం పూర్తిగా మారే అవకాశం ఉంది. ఈ కమ్యూనిటీ ఫీచర్ అచ్చం ఫేస్ బుక్ లో ఉన్న కమ్యూనిటీ ఫీచర్ లాగే ఉండొచ్చని చాలా మంది టెక్ నిపుణులు భావిస్తున్నారు.త్వరలో కమ్యూనిటీ ఫీచర్ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఎక్స్‌డీఏ డెవలపర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ టెక్నాలజీ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు. వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ ట్యాబ్ అందుబాటులోకి వచ్చాక ఇప్పుడున్న గ్రూప్స్ డిఫరెంట్‌గా కనిపిస్తాయని టెక్నాలజీ ప్రతినిధులు తెలిపారు.