కోడంగల్ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడికి ఐటీఏపీ అవార్డు
– ప్రభుత్వ బడుల పురోగతికి దక్కిన పురస్కారం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాత కోడంగల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఇల్లూరి క్రాంతి కుమార్‌కు అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని ట్యూటర్స్ ఫ్రైడ్ అనే సంస్థ ఐటీఏపీ అవార్డును అందజేసింది. గత కొన్నేళ్లుగా ట్యూటర్ ఫ్రైడ్ సంస్థ గ్రామీణ ప్రాంత పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నైపుణ్యం అయినా విద్యను అందించడమే లక్ష్యంగా పని చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పరుస్తూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులను అందిస్తుంది. ఇందులో భాగంగా ఈ యేడాది పాత కొడంగల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఇల్లూరి క్రాంతి కుమార్ అవార్డును అందజేసింది.ఆదివారం సంస్థ నిర్వహించిన జూమ్ మీటింగ్ నందు అవార్డును క్రాంతి కుమార్ కు అందించినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయులు క్రాంతికుమార్ సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
