మునుగోడు మాదే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మునుగోడు మాదే..!
– టీఆర్ఎస్‌కు బంపర్ మెజార్టీ ఖాయం
– వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కే పట్టం
– వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: మునుగోడు ఉప పోరులో టీఆర్ఎస్‌ గెలుపు ఖాయమని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గురువారం రాజుగౌడ్ మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపును ఎవ్వరు ఆపలేరన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలతో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్‌ను ఆదరించడం జరుగుతుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వం సంక్షేమంతో అన్ని వర్గాల ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి భారీ మెజార్టీ తథ్యం అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు రెండు, మూడు స్థానాలే దక్కుతాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల తరువాత రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్(టీఆర్ఎస్‌) పార్టీ విజయం సాధిస్తుందని, ప్రజలంతా మూడోసారి టీఆర్ఎస్‌కు పట్టం కడుతారని ధీమా వ్యక్తం చేశారు.