కూలీల మృతి దురదృష్టకరం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కూలీల మృతి దురదృష్టకరం
– బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్
– కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో కూలీల మృతి బాధాకరమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా ధారూర్‌ మండల పరిధి కేరెళ్లి – బాచారం వద్ద జరిగిన ఆటో, లారీ ఢీకొని జరిగిన ప్రమాదంలో పెద్దెముల్ మండలం మదనంతపూర్ కు చెందిన రవి, కిషన్, హేమ్లా నాయక్, అదేవిధంగా రేగొండికి చెందిన ఆటో డ్రైవర్ జలీల్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కమీషన్ మెంబర్ శుభప్రద్‌ పటేల్ మృతుల గ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కూలీలు, డ్రైవర్ మృతి దురదృష్టకరమన్నారు. కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి సాయం అందివచ్చేందుకు సహాకారం అందిస్తామని భోరోసా అందించారు. ఆయన వెంట నాయకులు, యువకులు ఉన్నారు.