చైర్ పర్సన్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్ గుప్త కుటుంబాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పరామర్శించారు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తండ్రి ఎం.బాలయ్య నారాయణఖేడ్ మండలం నిజాంపేట్‌లో బుధవారం కన్నుమూశారు. శుక్రవారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నిజాంపేట్‌కు చేరుకున్నారు. అక్కడ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త పరామర్శించి ఆమె తండ్రి చిత్రపటానికి పూలు వేసి శ్రద్దాంంజలి ఘటించారు. ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, తాండూరు టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త తదితరులు ఉన్నారు.
