తాండూరులో నీటి ఎద్దడిని తీర్చండి సారు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరులో నీటి ఎద్దడిని తీర్చండి సారు..!
– జిల్లా కలెక్టర్‌తో మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మొర
– కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని తాండూరు మున్సిపల్‌లో నీటి ఎద్దడిని తీర్చండి సారూ అంటూ జిల్లా కలెక్టర్‌ను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు కోరారు.

మంగళవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్దర్‌ను కౌన్సిలర్లు ఈర్షాద్, అనిల్, యోగానంద్, నాయకులు కలిశారు. ఈ సందర్బంగా ప్రస్తుత వేసవిలో తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

నీటి అవసరాలు తీరక ప్రజలు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి సమస్యను తీర్చేందుకు ప్రతి వార్డులో మూడు చొప్పున కొత్త బోర్లను మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు కౌన్సిలర్లు తెలిపారు.

తాండూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్‌ఎస్ పార్టీ, కౌన్సిర్లుగా కృషి చేయడం మా ధ్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్ గౌడ్, ఏజాజ్ తదితరులు ఉన్నారు.

వైభవంగా వరసిద్ది వినాయక దేవాలయ వార్షికోత్సవం