ప్ర‌ధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ

జాతీయం తెలంగాణ

ప్ర‌ధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ
– ప‌ది విన‌తులు, పావుగంట చ‌ర్చ‌
ద‌ర్శిని ప్ర‌తినిధి: భార‌త‌ ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ రాష్ట్ర‌ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఢీల్లీ ప‌ర్య‌ట‌న‌లో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం సీఎ కేసీఆర్.. ప్ర‌ధాని మోడితో స‌మావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఇరువురి మ‌ద్య భేటీ జ‌రిగింది. ఈ సందర్భంగా మోదీకి సీఎం కేసీఆర్‌ పది వినతిపత్రాలను అందజేశారు. తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయాలని కోరారు. అదే విధంగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాదు-నాగపూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని, కొత్తగా ఏర్పడిన జిల్లాలలో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయలని విజ్ఞ‌ప్తి చేశారు. కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటీకి నిధులు మంజూరు చేయాలని, హైదరాబాద్‌లో ఐఐఎంను ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అదనపు నిధులు ఇవ్వాలన్నారు. వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు వేసేందుకు నిధులు మంజురు చేయాలని కోరారు. గిరిజన విశ్వ విద్యాలయాన్ని మంజురు చేయాలని ప్రధాని మోదీని కోరారు.