బీజేపీ దేశానికి పట్టిన శాపం
– తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక కుట్ర
– సీఎం కేసీఆర్‌కు చెప్పే కేంద్రం కుక్కలకు గాలం
– వందల కోట్లు, పదువులు ఇస్తామన్నా లెక్కచేయలే
– కొనుగోలుకు వచ్చిన వారికి చిప్పకూడు
– తోడగొట్టి చెప్తున్న తాండూరు రూపురేఖలు మారుస్తాం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పైలెట్ కు బ్రహ్మరథం పట్టిన నేతలు, ప్రజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ పార్టీ భారత దేశానికి పట్టిన శాపం అని.. ఆ శాపం తెలంగాణకు పట్టొద్దనే కేంద్రం కుట్రను బద్దలు కొట్టడం జరిగిందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తరువాత మొదటి సారి తాండూరుకు విచ్చేసిన పైలెట్ రోహిత్ రెడ్డికి టీఆర్ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తా వద్ద ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభావేదికపై నుంచి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఎర కుట్రను వెల్లడించారు. వందల కోట్లు ఇస్తాం.. కేంద్ర పదువులు ఇస్తాం.. వై క్యాటగిరి భద్రత పెంచుతామని కేంద్రం కుక్కలు ఎరవేశాయన్నారు. తెలంగాణపై కేంద్రం ఓర్వలేని తనంతో చేపట్టిన కుట్రను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని గుర్తుచేశారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందుకు ఎక్కువగా చెప్పలేన్నారు. బీజేపీ దేశానికి పట్టిన శాపం అన్నారు. దేశంలో 9 రాష్ట్రా లను కొనుగోలు చేసిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణను కూడ కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందన్నారు. బీజేపీ వేట కుక్కల్లా తెలంగాణపై పడేందుకు యత్నిస్తుంటే రాష్ట్రాన్ని కొల్లగొట్టేందుకు వచ్చిన ఢిల్లీ కుక్కలకు చెంచల్ గూడ జైల్లో చిప్ప కూడు తినిపిస్తున్నామన్నారు. తాండూరు ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే ఈ కుట్రను బద్దలు చేయడం జరిగిందన్నారు.

కోట్లాధి నిధులతో తాండూరుకు మహర్ధశ
సీఎం కేసీఆర్ సహాకారంతో తాండూరు నియోజకవర్గానికి కోట్లాది నిధులు మంజూరు కాబోతున్నాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కోట్ పల్లి ప్రాజెక్టుకు, శివసాగర్ ప్రాజెక్టు పనులతో పాటు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలకు రూ. 50లక్షలు, మున్సిపల్ వార్డులకు రూ. 1 కోటి, ఇతర అభివృద్ధి పనులకు నిధులు రాబోతున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తాండూరును కాలుష్య రహిత ప్రాంతంగా మార్చుకోబోతున్నామని అన్నారు. మొదటి, రెండు ఏడాదిలలో ఎన్నికలు, కరోనా మహామ్మారితో అభివృద్ధి జరగలేదన్నారు. వచ్చే ఏడాదిలోగా తాండూరు రూపురేఖలు మార్చి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు.
తోడగొట్టి చెప్తున్న తగ్గేదిలే
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తనపై ఎన్నో కుట్రలు సృష్టించారని అన్నారు. తనపై మతం రంగు రుద్దారని, కోట్లకు అమ్ముడు పోయారని ప్రచారం చేస్తూ తాండూరు ప్రజలకు దూరం చేసే కుతంత్రాలకు పాల్పడ్డారని అన్నారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా.. అడ్డంకులు సృష్టించినా… తగ్గేదిలేదని కయ్యం దువ్వారు. తోడగొట్టి చెప్తున్న తాండూరు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తాండూరు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌తో బంగారు భారతదేశం
ఎనిమిదేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపారని, ఆ ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఎనిమిదేళ్ల తరువాత టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ మార్చి సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో రావడం శుభపరిణామన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా సీఎం కేసీఆర్ ప్రధాని ఉంటే భారత దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలుపుతారని అన్నారు. బీఆర్ఎస్‌తో బంగారు భారత దేశంగా మారుతుందని అన్నారు. ఇందుకు ప్రజలందరు సీఎం కేసీఆర్ ప్రధానిగా గెలిపించుకునేందుకు అండగా ఉండాలని.. ఆదరించాలని పిలుపునిచ్చారు.
పైలెట్‌కు బ్రహ్మరథం
పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తాలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి నేతలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పట్టణంలోని రాజీవ్ కాలనీ నుంచి భద్రేశ్వర చౌరస్తా వరకు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి సన్మానాలు, గజమాలల సత్కారాలతో బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్క చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, బంటారం సుధాకర్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సంగీత ఠాకూర్, విజయాదేవి, పట్టణ ప్రధాన కార్యదర్శులు ఎం. శ్రీనివాస్, సంతోష్ గౌడ్, ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, తాండూరు మండల అధ్యక్షులు రాందాస్, పెద్దేముల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, బషీరాబాద్ మండల అధ్యక్షులు రాములు నాయక్, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మహిళ కన్విసర్ శకుంతల, కోట్‌పల్లి మార్కెట్ కమిటి చైర్మన్ మహేందర్, దేవాలయాల చైర్మన్లు, యువనాయకులు, కౌన్సిలర్లు, యువజన సంఘాల నాయకులు, అనుబంధ సంఘాల కమిటి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

