పకడ్బందీగా ఓటరు జాబితా

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

పకడ్బందీగా ఓటరు జాబితా
– తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్
– స్పెషల్ డ్రైవ్ను పరిశీలించిన ఆర్డీఓ
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓటరు జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చేపట్టాలని తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ అధికారులను అదేశించారు. శనివారం భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ పరిధిలో ఓటరు జాబితా సవరణ, ఓటరు నమోదుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన శిబిరాలను ఆర్డీఓ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. ఆయా శిబిరాలలో జాబితా సవరణకు సంబంధించి, ఓటర్ల నమోదుకు సంబందించి వచ్చిన దరఖాస్తులపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితా సవరణను పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిబిరాలకు వచ్చే ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలన్నారు. ఆదివారం కూడ ఓటరు జాబితాపై స్పెషల్ డ్రైవ్ ఉంటుందని, అర్హులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టీఓ వెంట మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, బీఎల్ఎలు తదితరులు ఉన్నారు.