మంచి మనసును చాటిన సరళమ్మా సాయం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

మంచి మనసును చాటిన సరళమ్మా సాయం
– ఫిజియోథెరఫీ విద్యార్థికి చేయూతనిచ్చిన ఆర్బీఓఎల్ ఎండీ
– కృతజ్ఞతలు తెలిపిన తండ్రి, విద్యార్థి
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యారంగంలో విద్యార్థుల అభివృద్ధికి అండగా ఉంటామని ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి మంచి మనసును చాటుకుంటున్నారు.

బషీరాబాద్ మండలం బాదాపూర్ గ్రామానికి చెందిన విలేకరి విజయ్ కుమార్ కుమారుడు శరత్ చంద్ర ఫిజియోథెరఫీ(బీపీటీ)లో సీటు సాధించాడు. అయితే చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని. సరళారెడ్డి సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. బుధవారం తన నివాసంలో కలిసిన విద్యార్థి శరత్ చంద్ర చదువుకోసం రూ. 21 వేలను సాయంగా అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని అన్నారు. అలాంటి పేద విద్యార్థులకు తమవంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు. మరోవైపు చదువుకునేందుకు ఆర్థిక సాయం అందించడం పట్ల విలేకరి విజయ్ కుమార్, విద్యార్థి శరత్ చంద్ర బుయ్యని సరళారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ