గిరిజనులు గుర్తుంచుకునే నేత రోహిత్ రెడ్డి
– తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్
– బంజార భవన్‌కు నిధుల కేటాయింపుపై పాలాభిషేకం
తాండూరు, దర్శిని ప్రతినిధి: సీఎం కేసీఆర్ తరువాత గిరిజనులు గుర్తించుకునే నేత తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. తాండూరు చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సీఎం కేసీఆర్ ద్వారా ఏకకాలంలో రూ. 134 కోట్ల నిధులను సాధించడం పట్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చిత్రపటాలకు ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వల్ల రాష్ట్రంలోని గిరిజన తాండాలు పంచాయతీలుగా మారాయని అన్నారు. గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ స్పూర్తితో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు ఎరవేసినా తాండూర్ అభివృద్దే లక్ష్యంగా నాయకుల కుట్రలను కుతంత్రాలను బహిర్గతం చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ ద్వారా సాధించిన నిధులలో గిరిజనుల బంజార్ భవన్‌కు రూ. 1 కోటి కేటాయించి గిరిజనుల పక్షపాతిగా మారారని అన్నారు. అందరు ఆయనను గుర్తించుకుని రాబోవు ఎన్నికలలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మరోసారి భారీ మెజారిటీ తో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా గిరిజన నాయకులు రాములు నాయక్, భీమ్ సింగ్, వెంకట్ రామ్, జ్ఞానేశ్వర్, మిత్రూ నాయక్,మాన్యా నాయక్, నరేష్, మోహన్, రెడ్యానాయక్, లక్ష్మణ్ నాయక్, తార్య నాయక్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

