అవిశ్వాసం పెట్టాల్సిందే..!
– వికారాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ల డిమాండ్
– జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేతకు సిద్దం
– జిల్లా కేంద్రంలో వేడెక్కిన రాజకీయం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ రాజకీయం వేడెక్కింది. మున్సిపల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాసం పెట్టాలని వ్యతిరేక కౌన్సిలర్లు కోరేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసేందుకు కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్ పర్సన్ పుష్పలతారెడ్డిల మద్య చైర్ పర్సన్ పదవి విషయంలో ఒప్పందం జరిగిందని ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అయితే ఒప్పందం ప్రకారం చైర్ పర్సన్ కుర్చీ దిగక పోవడంతో వ్యతిరేకత పెరిగింది. చైర్ పర్సన్ పదవి కాలం మూడేళ్లు పూర్తి కావడంతో ఆవిశ్వాసం పెట్టించేందుకు సిద్దమయ్యారు. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, ప్రస్తుత కౌన్సిలర్ పుష్పలతారెడ్డి ఆధ్వర్యంలో 18 కౌన్సిలర్ల మద్దతుతో అవిశ్వాసం పెట్టించాలని తీర్మానించారు. ఇందుకు సంతకాల సేకరణ కూడ చేపట్టారు. ఇందులో భాగంగా పుష్పలతా రెడ్డి వికారాబాద్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. చైర్ పర్సన్‌పై అవిశ్వాసం పెట్టాల్సిందే అంటూ కలెక్టర్‌ను కోరబోతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పదవి రాజకీయం వేడెక్కింది.

