తాండూరుకు జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు

తాండూరు వికారాబాద్ హైదరాబాద్

తాండూరుకు జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు
– ఆపూర్వ ఫ్యాషన్ మాల్‌ ప్రారంభోత్సవానికి రాక
తాండూరు, దర్శిని ప్రతినిధి: బుల్లితెరలో నవ్వులు పూయిస్తున్న ఈటీవి జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు రేను తాండూరుకు విచ్చేస్తున్నారు. జబర్దస్త్ కొత్త యాంకర్‌గా సౌమ్య రావు షో ను యాంకర్‌గా లీడ్‌ చేస్తూ అదరగొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఆమె శుక్రవారం తాండూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి ఆపూర్వ ఫ్యాషన్ మాల్‌ ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న తనను ఆదరించాలని.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సామాజిక మాధ్యమాలలో విజ్ఙప్తి చేశారు. ఈటీవీ లో జబర్దస్త్‌తో పాటు శ్రీమంతుడు సీరియలో నటిస్తుంది సౌమ్య రావు. మరోవైపు నిర్వహకులు సైతం ఆపూర్వ ఫ్యాషన్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.