నేడే శివదత్త అంత్యక్రియలు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

నేడే శివదత్త అంత్యక్రియలు
– కొద్ది సేపట్లో ఇంటికి మృతదేహం
తాండూరు, దర్శిని ప్రతినిధి: యునైటేడ్ స్టేట్స్ మిస్సోరిలో మృతి చెందిన తాండూరు వైద్య విద్యార్థి శివదత్త అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అంతిమ యాత్ర నిర్వహిస్తున్నట్లు కుటుంబ సన్నిహితులు తెలిపారు. తాండూరు పట్టణంలోని అపెక్స్ హాస్పిటల్ యజమాని వెంకటేశం, జ్యోతిలకు ఇద్దరు కుమారులు విక్రమ్‌, రెండో కుమారుడు శివదత్త(25)లో యూఎస్‌లోని మిస్సోరిలోని ఓజార్క్ సరస్సు(లేక్) వద్దకు వెళ్లి అక్కడ ప్రమాద వశాత్తు ఇద్దరు మునిగిపోయి మృతి చెందిన విషయం తెలిసిందే. యూస్‌లో అన్ని నిబంధనలు పూర్తి చేసి ఇండియాకు పంపించారు. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి తీసుకవస్తున్నారు. మధ్యాహ్నం తాండూరు పట్టణంలో శివదత్త అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న బందు, మిత్రులు, సన్నిహితులు నివాసానికి చేరుకున్నారు.